సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోలు తమ హోదాను మరింత పెంపొందించుకొని ఒక పొజిషన్ కి చేరుకున్న తర్వాత వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. అలా ఎంతోమంది సీనియర్ హీరోలు, హీరోయిన్లు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారి కంటూ ఒక స్థానాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలోకి తండ్రుల లేదా తల్లుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అడుగుపెట్టినప్పటికీ మొదటి సినిమా లేదా రెండు సినిమాల వరకు వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఆ తర్వాత వారే తమ టాలెంటును నిరూపించుకోవాల్సి ఉంటుంది లేకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సిందే.
ఇకపోతే అలా స్టార్ హీరోలు కూతుర్లు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది సక్సెస్ కాలేక తమ తండ్రుల ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారు అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం.
సుస్మిత కొణిదెల - చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన ఈమె ఇప్పుడు నిర్మాతగా కూడా ఒక ప్రొడక్షన్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి సినిమాలను తన భర్తతో కలిసి నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా సుస్మిత కొణిదెల తాజాగా తన తండ్రి చిరంజీవి నటిస్తున్న కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించగా ఆ చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి.
ఐశ్వర్య ధనుష్ - రజనీకాంత్
ప్రముఖ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ధనుష్ ఇటీవల తన దర్శకత్వంలో లాల్ సలాం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో తన తండ్రి రజనీకాంత్ నటించగా.. మొదటిసారి డిఫరెంట్ లుక్ లో ఆయన కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాదు ఆయన లుక్ ఏమాత్రం ఆయన హోదాకు తగ్గట్టు లేదు. దీంతో ఆయన పరువు పోయిందనే కామెంట్లు కూడా వినిపించాయి.