చిరంజీవి తర్వాత.. ఆ రేంజ్ లో డాన్స్ చేసే హీరో అతనొక్కడే?

praveen
సినిమా ఇండస్ట్రీలో హీరోల నటనకు మాత్రమే కాదు వారు చేసే డ్యాన్సులకు కూడా యమ క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా అంతకుముందు ఎన్నడూ ప్రేక్షకులు చూడని విధంగా సరికొత్తగా డాన్స్ స్టెప్పులు చేసి ఇక ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక రకంగా చెప్పాలంటే తన డాన్సులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పాలి. ఏకంగా చిరంజీవి ఒంట్లో స్ప్రింగులు ఏమైనా ఉన్నాయా అని అందరూ అనుమాన పడేంతలా డాన్సులు ఇరగదీసాడు. ఒకరకంగా చిరంజీవి స్టార్ హీరో కావడానికి నటన ఎంత అయితే కారణమో.. ఆయన డాన్సులు కూడా అంతే కారణం అని చెప్పాలి.



 అయితే ఇప్పటికి ఎంతో మంది యువ హీరోలు డాన్సుల్లో ఇరగదీస్తున్న అటు మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో మాత్రం ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అయితే ఒకప్పుడైతే బెస్ట్ డాన్సర్ ఎవరో అనగానే చిరంజీవి పేరు చెప్పేవారు.  కానీ ఇప్పుడు బెస్ట్ డాన్సర్ ఎవరు అనే సందేహం మాత్రం ఎప్పుడు అందరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్ర హీరోలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు అందరూ డాన్సులు ఇరగదీస్తున్నారు. దీంతో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే చెప్పడం మాత్రం చాలా కష్టమని అంటూ ఉంటారు సినీ విశ్లేషకులు కూడా. అయితే సీనియర్ నటుడు సుమన్ మాత్రం ఈ విషయంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో చిరంజీవి గారు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. ఇక ఆయన రేంజ్ లో డాన్స్ చేసే ప్రస్తుత హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. అలాంటి సత్తా ఉన్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. చిరంజీవి తర్వాత అలా డాన్స్ చేసే సత్తా ఎన్టీఆర్లో మాత్రమే ఉంది అంటూ సుమన్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. అతను డాన్స్ చేస్తుంటే ప్రేక్షకుడి కళ్ళు మొత్తం అతని కాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయేలా తారక్ డాన్స్ చేస్తాడని సుమన్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: