తారక్ డ్యాన్స్ పై రంభ వైరల్ కామెంట్స్..?

Purushottham Vinay
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఇంకా అలాగే ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి దాకా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించిన తారక్..ఆర్ఆర్ఆర్ సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు తారక్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక తారక్ డాన్స్ లకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే చాలా మంది కూడా టక్కున చెప్పే పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు కూడా ప్రశంసించారు. తాజాగా సీనియర్ అందాల నటి రంభ కూడా తారక్ డాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రంభకు చాలా మంచి పేరు ఉంది. అప్పట్లో తన గ్లామర్ తో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.


పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో చేయాలనీ ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు హీరోయిన్ త్రిష అంటే ఇష్టమని ఆమె చాలా ఆప్యాయంగా మాట్లాడుతుందని తెలిపారు రంభ.ఇక తారక్ డాన్స్ గురించి కూడా మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన ఐటమ్ సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే చాలా ఇష్టమని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తామని.. ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే నిజంగా పిచ్చెక్కుతుందని నా దృష్టిలో మైకేల్ జాక్సన్ కన్నా తారక్ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు రంభ. ఇంకా అలాగే కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా అంటే చాలా ఇష్టమని రంభ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: