విరూపాక్ష సినిమా బిజినెస్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

Divya
హీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా హర్రర్ త్రిల్లర్ జోనర్లో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సాయి ధరం తేజ్ కెరీయర్లోని ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడి తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది.. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా నైజాం లో రూ.7.20 కోట్లు విశాఖపట్నంలో రూ.2.25 కోట్లు ఈస్ట్ గోదావరిలో రూ.1.45 కోట్లు వెస్ట్ గోదావరి లో రూ.1.25 కోట్లు , కృష్ణ లో రూ.1.45 కోట్లు గుంటూరు రూ.1.65 కోట్లు నెల్లూరులో  రూ.70 లక్షలు.. సిడెడ్ లో రూ.3.85 కోట్ల మేరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కోటి రూపాయలు రెస్ట్ ఆఫ్ రూ.50 లక్షలు ఓవర్సీస్ లో రూ.1.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .25 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ .26 కోట్ల రూపాయల షేర్  కలెక్షన్స్ను అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఓపెనింగ్ పరంగా కూడా ఎలాంటి డోకా లేదన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా ఏ మేరకు రాబడుతుందో చూడాలి మరి. సాయి ధరంతేజ్ చివరిగా పబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా టాక్ బాగున్న కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: