ఆ తేదీ నుండి పవన్ కొత్త మూవీ లేటెస్ట్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబందించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ కి సంబంధించిన మరి కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 13 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో ఈ చిత్ర బృందం పవన్ పై భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ యాక్షన్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ప్రత్యేక సెట్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సెట్ లో పవన్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ మూవీ ని రూపొందిస్తున్నారు. పవన్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ లో పవన్ పై చిత్ర బృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: