టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయినా ఈ సినిమాలకు ఆడియన్స్ లో సపరేట్ క్రేజ్ ఉంది. అందుకే మరోసారి వీరి కాంబో మూవీ కోసం అందరూ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ కొట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చేడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మహేష్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్లో నోట్లో సిగరెట్ పెట్టుకుని స్టైల్ గా నడిచి వస్తున్న మహేష్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట.
అది కూడా తండ్రి, కొడుకు పాత్రలో మహేష్ కనిపిస్తాడని.. ఈ మూవీ స్టోరీ బాలయ్య రీసెంట్ సూపర్ హిట్ 'వీర సింహారెడ్డి' మూవీని పోలి ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో మహేష్, త్రివిక్రమ్ మూవీ బాలయ్య వీరసింహారెడ్డికి ఫ్రీమేక్ గా వస్తుందంటూ సోషల్ మీడియా అంతటా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది...!!