రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని టీ టౌన్ లో ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట 'గీతాగోవిందం' అనే సినిమాతో తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ రెండు సినిమాల తోనే వీరిద్దరి జోడికి టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కేవలం ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళ పెయిర్ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇద్దరూ కలిసి వర్కౌట్స్ చేయడం దగ్గరనుంచి వెకేషన్స్, డిన్నర్, పార్టీస్ అంటూ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బయటికి రావడంతో..
వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. దీనికి తోడు అటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో ఎటువంటి అకేషన్ ఉన్న దానికి రష్మిక మందన హాజరవడం, వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో విజయ్ ఫ్యామిలీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలోనే వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నార నే టాక్ కూడా గట్టిగా వినిపించింది. అయితే తాజాగా రష్మిక మందన తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్తున్నా ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆమె వీడియో పోస్ట్ చేసిన కాసేపటికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సేమ్ అదే లోకేషన్ లో ఉన్న మరో ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఓ మీడియా సంస్థ విజయ్ దేవరకొండ, రష్మిక ల డేటింగ్ నిజమేనని చెబుతూ..' విజయ్ తనకిష్టమైన రింగ్ను రష్మికకు తొడిగాడని.. వారిద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూమ్లో కలిసి ఉంటున్నారని, త్వరలోనే మనమంతా ఒక గుడ్ న్యూస్ వినబోతున్నామంటూ' ట్వీట్ చేసింది. అయితే తాజాగా ఈ ట్వీట్ పై రష్మిక స్పందిస్తూ.." అయ్యో.. అతిగా ఆలోచించకు బాబు" అని రిట్వీట్ చేసింది.కానీ తామిద్దరం ప్రేమలో లేమనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో తమ రిలేషన్షిప్ గురించి త్వరలోనే విజయ్, రష్మిక కలిసి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంటూ నెటిజెన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానులు కోరుకుంటున్న ఆ గుడ్ న్యూస్ ని ఈ జంట ఎప్పుడు చెప్తారో చూడాలి...!!