మెగాస్టార్ ను కలిసిన కిరణ్ అబ్బవరం హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజా వారు రాణి గారు మూవీ తో హీరో గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరో గా ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో కు ఈ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది. తాజాగా ఈ హీరో మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అతుల్య రవి హీరోయిన్ గా నటించింది. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే మీటర్ మూవీ లో హీరోయిన్ గా నటించినటు వంటి అతుల్య రవి తాజాగా మెగాస్టార్ చిరంజీవి ని కలిసింది. తాజాగా ఈ నటి ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇవి వైరల్ గా మారుతున్నాయి. అత్యంత సంతోషకరమైన క్షణం మీటర్ మూవీ సమయంలో జరిగింది. నన్ను ఆశీర్వదించినందుకు చిరంజీవి కి ధన్యవాదాలు. ఇది నాకు జీవితకాల జ్ఞాపకం అని అతుల్య రవి అన్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే ఆతుల్య రవి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: