రవితేజ ... హరీష్ శంకర్ కాంబినేషన్లో ఆ నేపథ్యంలో మూవీ..?

Pulgam Srinivas
మాస్ మహా రాజా రవి తేజ చాలా చిన్న స్థాయి నుండి ప్రస్తుతం స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విషయం మన అందరికీ తెలిసింది. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో ... విలన్ పాత్రల్లో ... ముఖ్య పాత్రల్లో నటించిన రవితేజ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా లలో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే.

అలా రవితేజ అవకాశం ఇచ్చిన దర్శకులలో చాలా మంది దర్శకులు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు . అలా రవితేజ అవకాశంతో మొదటి సినిమాకు దరక్షకత్వం వహించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు . ఈ దర్శకుడు రవితేజ హీరో గా రూపొందిన షాక్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందినటు వంటి మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత అనేక విజయాలను అందుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు మరోసారి రవితేజ హీరోగా ఒక మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది . రవితేజ కోసం ఇప్పటికే హరీష్ శంకర్ పిరియాడిక్ డ్రామా తో ఒక కథను రూపొందించినట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: