ఉపేంద్ర 'కబ్జా' మూవీ వచ్చేది ఆ ఓటీటీ లోనే..?

Anilkumar
కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర నటించిన తాజా చిత్రం 'కబ్జా'. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆసక్తిని కనబరిచిన చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు మొత్తం కే జి ఎఫ్ సెట్ లోనే అచ్చుగుద్దినట్టు ఈ సినిమాను తీశారని విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాదే విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మార్చి 17న విడుదల కాబోతుంది. కే జి ఎఫ్ సినిమాకి సంగీతమందించిన రవి బసుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

ప్రస్తుతం థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ ని కనబరిచిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా 150 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ కబ్జా మూవీ డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం.ఇక ఓటీటీలో ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఉపేంద్ర సరసన శ్రియా శరన్ హీరోయిన్గా నటించగా.. కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవెల్ లో కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. 1942 నుంచి 1986 మధ్య కాలంలో ఉన్న ఓ గ్యాంగ్స్టర్ కథనే సినిమాగా తెరకెక్కించారు.

ఓ చిన్న గ్యాంగ్ స్టార్ పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడు అన్నది ఈ మూవీ ప్రధాన కథాంశం. నిజానికి ఈ మూవీ కథ విన్నా.. ట్రైలర్ చూసినా మనకు కచ్చితంగా కేజీఎఫ్ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమా రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో మేకింగ్ పరంగా వాటి ప్రభావం కబ్జా మూవీపై పడిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అన్ని భాషల్లో శుక్రవారం మార్చి 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి సోషల్ మీడియా వేదికగా చాలా వరకు పాజిటివ్ విలువచ్చాయి. సినిమాలో స్క్రీన్ ప్లే, స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయంటూ చెబుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం థియేటర్స్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: