టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా కంటే ముందు గోపీచంద్ మలినేని మీడియం రేంజ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగాడు. ఇప్పుడు మాత్రం మాస్ దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ గా మారుతుంది. ఈ సంక్రాంతికి బాలయ్యను వీరసింహారెడ్డిగా ప్రజెంట్ చేశాడు గోపీచంద్ మలినేని. సినిమాలో బాలయ్యను ఫ్యాక్షనిస్టుగా ఊర మాస్ పాత్రలో చూపించి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాడు. ఫలితంగా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
ఇటీవల బాలయ్యతో వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడి తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది అనే దానిపై ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో గోపీచంద్ మలినేని ఒక సినిమా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. నిజానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే గోపీచంద్ మలినేని ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఇటీవల ఆ కథను ఎన్టీఆర్ వద్దకు వెళ్లి చెప్పగా.. దానికి ఎన్టీఆర్ బదులిస్తూ..కథ అంతా బాగుంది. కానీ నీ మార్క్ కామెడీ మాత్రం మిస్సయింది' అని అన్నారట. దీంతో గోపీచంద్ ప్రస్తుతం ఆ కథను పక్కన పెట్టేసి ఇప్పుడు మరో స్టార్ హీరో కోసం కథను సెట్ చేశాడు.
ఈ ప్రాజెక్టు కూడా మైత్రి మూవీస్ సంస్థ లోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం యాక్షన్ హీరో గోపీచంద్ తో ఈ డైరెక్టర్ ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఓ మాస్ సినిమాను చేసే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వస్తున్నాయి. అటు కళ్యాణ్ రామ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడట. కాగా గోపీచంద్ సినిమా సెక్స్ పైకి వెళ్లే లోగా ఎన్టీఆర్ కి వినిపించిన స్క్రిప్ట్ పై ఇంకా హార్డ్ వర్క్ చేసి ఎలాగైనా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట ఈ డైరెక్టర్. మొత్తం మీద ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గా పిలవబడుతున్న గోపీచంద్ మలినేని కెరీర్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు...!!