రాజమౌళి ఈగ రైటర్ నుంచి గొప్ప సాహిత్యం.. పాఠకుల మనసు దోచుకుంటున్న జనార్ధన మహర్షి..!!

Anilkumar
తెలుగు భాషా రచయితల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వారిలో జనార్ధన మహర్షి కూడా ఒకరు. ఈయన రైటర్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేశారు. ఒకవైపు సినిమాలకు రచయితగా పని చేస్తూ మరోవైపు పుస్తకాలు కూడా రచించేవారు. ఆయన రాసిన నవలల్లో వెన్న ముద్దలు , చిదంబర రహస్యం అత్యంత ఆదరణ పొందాయి. 2003 వ సంవత్సరంలో రచయితగా ఆయన రచించిన మొదటి కవితా సంకలనం వెన్న ముద్దలు విడుదలై తెలుగు ఆధునిక పుస్తక విక్రయాల్లో మొదటి ఐదు స్థానంలో ఒకటిగా నిలిచి సుమారు 12 ముద్రణల వరకు కొనసాగింది. ఆ తర్వాత 2004లో మరింత ప్రజల్లోకి చేరుకోవడానికి పంచామృతాలు అనే పేరుతో చిన్న చిన్న కథలుగా ఒక కథ సంకలనం విడుదలై అది కూడా అత్యంత ఆదరణ పొందింది. ఇక ఆ తర్వాత 2007లో గర్భగుడిలోకి అనే సాత్వికమైన పేరుతో తాత్వికం దార్షనికం మేలవించి ఎన్నో తత్వాలను విధికరిస్తూ ఒక నవలలను రచించారు. 

ఇక దాన్ని గుడిగా విడుదల చేయగా అది 2012 సంవత్సరంలో కళాతపస్వికి విశ్వనాథ్ గారు అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కలిసిన దేవస్థానం అనే చిత్రానికే నాంది పలికింది. ఆ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు జనార్ధన మహర్షి కావడం మరో ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక ఈ కథ వృత్తాంతం ఎందరో విమర్శకుల ప్రశంసలను మన్ననలను పొంది 2021లో గర్భగుడిలోకిగా రెండవ ప్రచురణలో కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ భాషలో కూడా అనువాదమై విడుదలైంది. ఇక  2008లో నాకు నేను రాసుకున్న ప్రేమ కథ అనే కవితా సంకలనం కూడా జనార్ధన మహర్షి గారి ఒక అనూహ్యమైన ప్రయోగం అని చెప్పాలి. ఇక 2011లో ప్రతి కవికి అంకితమిస్తూ విడుదలైన కవిగానే కన్నుమూస్తా అనే కవితా సంకలనం తెలుగు కవిత ప్రపంచాన్ని కదిలించింది.

2019లో మధుర సంభాషణలు అనే సంభాషణ అనే సంకలనాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో 190 కి పైగా సంభాషణలు మనల్ని నవ్విస్తాయి, ప్రశ్నిస్తాయి, కవిస్థాయి, పరామర్శిస్తాయి. అలాగే వాస్తవిక ధోరణిలో ఎంతో ముక్కుసూటిగా ఉండే ప్రశ్నలు మనల్ని కచ్చితంగా భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక 2019లో 25 చిన్న చిన్న కథలతో వచ్చిన చిదంబర రహస్యం ఎన్నో ఆలోచనలు మరియు పాఠ్యాంశాలను తనదైన శైలిలో మనకి పరిచయం చేస్తుంది. ఈ పుస్తకంలో ఒక మార్మిక వాదం దాగుంది. దీని రెండో ముద్రణ 2022లో విడుదలైంది. ఇక 2021 లో వచ్చిన స్మశానానికి వైరాగ్యం అనే కథా సంకలనం ప్రతి మాట ఎంతో లోతుగా ఉండి మనలో ఆలోచనలే కాకుండా ఎన్నో నూతన భావాలను ప్రేరేపిస్తాయి. 2022లో వచ్చిన జనపదాలు ఒక నవ్య నూతన ప్రయోగం అవుతుంది. ఈ విధంగా రచయితగా జనార్ధన మహర్షి పాఠకుల మనసులు దోచుకుంటూ ఎంతో మంచి పేరు సంపాదించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: