వామ్మో.. మహేష్ డైరెక్టర్ అంతమంది నిర్మాతలకు కమిట్మెంట్స్ ఇచ్చాడా..?

Anilkumar
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 'యువత' అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పరశురాం. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే డైరెక్టర్గా తన మార్క్ చూపించాడు. అయితే ఆ తర్వాత డైరెక్టర్ గా పరుశురాంకి భారీ గుర్తింపు ఇచ్చిన సినిమా 'గీతాగోవిందం'. ఈ సినిమా విడుదల కంటే ముందు డైరెక్టర్ పరశురామ్ చాలా మందికి తెలియదు. కానీ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా ఏకంగా 70 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక గీత గోవిందం తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తే చాన్స్ కొట్టేశాడు పరశురాం. గత ఏడాది మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' అనే సినిమాని తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమాని హ్యాండిల్ చేయడంలో ఈ దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్ పరశురాంపై గట్టిగానే పడింది. అందుకే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ ఫై కి తీసుకెళ్లలేకపోయాడు. సర్కారు వారి పాట తర్వాత నాగచైతన్యతో, బాలకృష్ణతో, అల్లు అర్జున్తో చర్చలు జరిపినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ తోనే తన తదుపరి సినిమాను చేస్తున్నాడు. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. నిజానికి గీతాఅర్డ్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు పరశురాం. కానీ అదే ప్రాజెక్టుని ఇప్పుడు దిల్ రాజుతో ప్రకటించడం తీవ్ర దుమారాన్ని రేపింది.

ఇక ఈ ఘటనతో మెల్లమెల్లగా పరుశురాం కమిట్మెంట్స్  లిస్ట్ బయటికి వచ్చింది. ఈ దర్శకుడు గీతా ఆర్ట్స్ సంస్థ లో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడట. దాంతోపాటు 14 రీల్స్ తో ఓ సినిమాకు సైన్ చేశాడట. అటు దిల్ రాజుతో గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉందట. అది ఇప్పటికి కుదిరింది. అలాగే మరో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దగ్గర కూడా చాలా కాలం క్రితమే అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఊసే లేదు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో కూడా ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దీని ప్రస్తావన కూడా లేదు. ఇదంతా ఒకెత్తు అయితే మంచి ఫ్యామిలీ వారికి కూడా ఓ సినిమా చేస్తానని ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడట. ఆ కమిట్మెంట్ ఇచ్చి దాదాపు పదేళ్లు అవుతుందని అంటున్నారు. మరి నిజంగానే ఇంతమంది నిర్మాతలకు పరశురాం కమిట్మెంట్స్ ఇచ్చాడా? లేదా? అనేది తెలియాలంటే దీనిపై పరశురామే స్పందించాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: