తొలి ప్రేమ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరో చేసిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు తొలిప్రేమ. ఆ సినిమా కంటే ముందు నెమ్మదిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక కొత్త డైరెక్టర్ తో కంప్లీట్ లవ్ స్టోరీ చేయడం జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా కంటే ముందు పవన్ నటించిన సినిమాలన్నీ కూడా పెద్ద డైరెక్టర్లతో చేసినవే 1998లో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కంటే మూడు రెట్లు ఎక్కువ లాభాలను అందుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం  అయిన కీర్తి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఈ సినిమాలో అను అనే పాత్రలో చాలా చక్కగా నటించింది .అంతేకాదు అప్పట్లో ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూసిన యువత అంతా కూడా ఇలాంటి అమ్మాయి తమకి లవర్ గా వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమా తను స్టార్ హీరోయిన్ అవ్వడానికి పెద్దగా సహాయ పడలేదు అని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ఈమె ప్రేమించే మనసు రావోయి చందమామ అనే సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలో ఫ్లాప్ అయ్యాయి. దీంతో తనని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

దాని అనంతరం మహేష్ బాబు గుణశేఖర్ల కాంబినేషన్లో వచ్చిన అర్జున్ సినిమాతో ఆమెను అక్క పాత్రలో చూపించారు .ఇక ఆ సినిమా అప్పట్లో యావరేజ్ గా నిలిచింది. ఆ సినిమాతో కూడా ఈమెకి పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఇక ఈ సినిమాల అనంతరం ఈమె టాలీవుడ్ హీరో అయిన సుమంత్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అనంతరం కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. విడాకులు అనంతరం ఈమె ఒక ఎన్నారై ని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అయితే తాజాగా ఈమె ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ కు రావడం జరిగింది. ఇక ఈ వేడుకకు సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డి కూడా వచ్చింది. దీంతో ఈ ఈమె ఫోటోలు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: