పవన్-సుజిత్ ఓజి సినిమా ఆ సినిమల్లాగే ఉంటుందా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రన్ రాజా రన్ అనే సినిమాతో హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాను డైరెక్టర్ చేసే అవకాశాన్ని పట్టేశాడు. అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అనంతరం సాహో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సుజిత్. అనంతరం తన పెళ్లి కారణంగా ఆ ప్రాజెక్టుని వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు సుజిత్. 

ఇక ఈ ప్రాజెక్టుకు ఓజి అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందా లేదా అన్నది కూడా తెలియదు. కానీ ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది అని అందరూ చూస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. కానీ ఇలాంటి జోనర్ లోనే గతంలో పవన్ కళ్యాణ్ పంజా సినిమా చేయడం జరిగింది.

అంతేకాదు మరోపక్క సుజిత్ ప్రభాస్తో కలిసి తీసిన సినిమా కూడా ఇలాంటిదే. కాబట్టి సుజిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమా కూడా ప్రభాస్ సినిమాకి కొనసాగింపుగా ఉంటుందేమో అని చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో అసలు పాటలు హీరోయిన్లు కూడా ఉండరు అని అంటున్నారు. పవన అభిమానులు భావిస్తున్న విధంగా ఇదే గనుక నిజమైతే ఈ సినిమా అజిత్ పై పెద్ద బర్డెన్ పెట్టినట్టే అవుతుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఉంటే గంటకు పైనే ఆ సినిమాని నడిపించొచ్చు. ఇక ఈ విషయంపై సుజిత్ ఏం చెబుతారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: