జీవితంలో అవి ఉంటే చాలు అంటున్న సాయి పల్లవి..!?

Anilkumar
టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. సినిమాల్లో ఒక విధంగా కనిపించే ఈమె బయట మాత్రం అలా అస్సలు ఉండదు. బయట చాలా చక్కగా సంప్రదాయమైన చీరకట్టులో ఎప్పుడూ కనిపిస్తుంది సాయి పల్లవి. సినిమాల పరంగా కంటే సాయి పల్లవికి వ్యక్తిగతంగానే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే సాయి పల్లవిని సినిమాల్లో మాత్రమే చూసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు. 

దర్శక నిర్మాతలు సైతం సాయి పల్లవికి సెట్ అయ్యే పాత్రలే ఇస్తూ ఉంటారు. ఫిదా లవ్ స్టోరీ వంటి సినిమాలలో సాయి పల్లవి నటనకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఇక  సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. కానీ ఆ సినిమాలో సాయి పల్లవి తన వంద శాతం నటనను కనబరిచింది. ఆ సినిమాలో సాయి పల్లవి తప్ప ఆ క్యారెక్టర్ కి మరో నటి సెట్ కాదు అన్న తరహాలో సాయి పల్లవి ఆ సినిమాలో నటించింది. ఆ సినిమా అనంతరం గార్గి సినిమాతో తన నటనను మరోసారి నిరూపించుకుంది సాయి పల్లవి. సాయి పల్లవికి ఒక్క సినిమా మాత్రమే కలిసి వచ్చింది.

ఇదిలా ఉంటే గతంలో విరాటపర్వం సినిమా సమయంలో తాను మాట్లాడిన కొన్ని మాటలతో వివాదాల్లో చిక్కుకుంది సాయి పల్లవి. హింస ఎక్కడ జరిగినా హింస అని తాను డాక్టర్ని అవడంతో తనకు ప్రాణం విలువ తెలుసు అని సాయి పల్లవి చెప్పడంతో ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలోనే కాంట్రవర్సీలు ఎక్కువ అవ్వడంతో సాయి పల్లవి సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1న ఒక గుడిలో ధ్యానం చేస్తూ కనిపించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియా వేదికదా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ నవ్వడం హోప్ ఉండడం గ్రాటిట్యూడ్ చూపిస్తే చాలు ఈ జీవితానికి అన్నట్టుగా పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: