ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి. అయితే గతంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయిందని మరొక షెడ్యూల్ త్వరలోనే జరగనుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అన్న వార్తలు వినిపించాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో

 రానున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు అన్న వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ముగ్గురు హీరోయిన్లలో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ కూడా ఉంది అని సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ అఫీషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ చిత్ర బృందం ఇవ్వలేదు. సినిమా విషయంలోనే క్లారిటీ లేదు అంటే హీరోయిన్ విషయంలో అసలు క్లారిటీ లేదు. అయితే తాజాగా మాళవిక మోహన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకి  సమాధానాలు

 ఇచ్చింది.ఇందులో భాగంగానే తెలుగు సినిమాల గురించి కూడా స్పందించింది మాళవిక.. ఇందులో భాగంగానే మానవి మోహన్ ఒక అభిమాని సినిమా ఏంటి ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించాడు.. ఇందులో భాగంగానే మాళవిక మోహన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పని జరుగుతుంది త్వరలోనే తప్పకుండా ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వస్తుంది అన్నట్లుగా చెప్పింది మాళవిక. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ప్రభాస్ సినిమాలో కాకుండా మరే తెలుగు సినిమాలలో కూడా నటించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మాళవిక ప్రభాస్ సినిమాలోని నటిస్తుంది అని ఫిక్స్ అయ్యారు వీరి అభిమానులు. అంతేకాదు ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రాబోయే సినిమాలోనే నటిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాకి రాజా డీలక్స్ టైటిల్ను అనుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిగా ప్రకటన మాత్రం ఇప్పటివరకు లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: