బాలయ్య, చిరంజీవి పారితోషకంలో.. ఇంత తేడానా?

praveen
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. అయితే హీరోలుగా ఈ ఇద్దరికీ ఒకే రకమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగినందున అటు మెగాస్టార్ మాత్రం బాలకృష్ణ కంటే ఒక్క మెట్టు పైన ఉంటాడు అని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తమ సినిమాలతో  సూపర్ హిట్ అందుకున్నారు.

 మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండు సినిమాలు హిట్ కావడంతో ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి. అయితే ఇద్దరు హీరోలు కూడా అటు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఒక్కోసారి ఒక్కో హీరో పైచేయి సాధించడం చేస్తూ ఉండేవారు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరు హీరోలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సూపర్ హిట్ సాధించారు.

 అయితే ఈ ఇద్దరు హీరోల పారితోషకం ఎంత  ఉంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే బాలకృష్ణతో పోల్చి చూస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది మాత్రం చిరంజీవి అన్నది తెలుస్తుంది. అంతేకాదు ఇక ఇద్దరి రేమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుందట. బాలకృష్ణ పారితోషకంతో పోల్చి చూస్తే చిరంజీవి పారితోషకం  రెండు రేట్లు ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే బాలయ్య పారితోషకం విషయంలో పెద్దగా పట్టింపులకు పోడట. కొందరు హీరోలు సినిమా విడుదల తర్వాత లాభాల్లో వాటాలు తీసుకుంటే ఇక బాలయ్య మాత్రం అలాంటివి తీసుకోడంటూ టాక్. అయితే అటు చిరంజీవి మాత్రం మొదట భారీగా అడ్వాన్స్ తీసుకోవడమే కాదు ఇక సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకుంటూ ఉంటాడట. ఏది నిజం అన్నది మాత్రం నిర్మాతలు నోరు విప్పితేనే క్లారిటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: