'వీరసింహరెడ్డి' లో 47 నిమిషాలు కట్ చేశారా..?
అందుతున్న సమాచారం ప్రకారం వీర సింహారెడ్డి సినిమా రన్ టైమ్ ఏకంగా 197 నిమిషాలు ఉందని తెలుస్తోంది. అంటే 3 గంటల 17 నిమిషాలు. ఇన్ని గంటల రన్ టైం తో థియేటర్లో సినిమా అంటే అది కష్టమే. అందుకే మరోసారి ఈ సినిమా రన్ టైమ్ ని కట్ చేసే పనిలో పడ్డారట మూవీ టీం. ఈ రన్ టైమ్ నుంచి కనీసం 50 నిమిషాలు అయినా తీసేయాలని అనుకుంటున్నారట. అంటే సినిమా మొత్తం రెండున్నర గంటలకు కుదించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటింగ్ టీమ్ అంతా కూడా ఇదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఫైనల్ ఎడిట్ పూర్తవుతుందని సమాచారం.
ఇటీవల అవతార్ 2 సినిమా కూడా మూడు గంటల 12 నిమిషాల నిడివితో విడుదలైంది. దీంతో ఈ సినిమా నిడివి విషయంలో ప్రేక్షకులు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆ పరిస్థితి ఇప్పుడు బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకి రావద్దని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి 50 నిమిషాలు కాకపోయినా కనీసం 30 నిమిషాలు అయినా కట్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నిడివి కేవలం 160 నిమిషాలే. ఈ లెక్కన చూసుకుంటే వీర సింహారెడ్డి నిడివి చాలా ఎక్కువ. అయితే మూవీ టీమ్ మాత్రం 47 నిమిషాల వరకు ఈ సినిమా రన్ టైం ని కత్తిరించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఆడియన్స్ కి ఇబ్బంది కలగకుండా ఈ సినిమా రన్ టైం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మరి మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి...!!