మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయకగా నటిస్తోంది. కంప్లీట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతోంది ఈ సినిమా. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు దర్శకుడు బాబి.
ఇక ఈ సినిమా గురించి బాబీ మాట్లాడుతూ..' ఈ సినిమా కథను లాక్ డౌన్ కు ముందే ఒక అభిమానిగా చిరంజీవి గారికి చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితిలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. అన్ని వర్గాల ఆడియన్స్ ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో అందరిని ఆకట్టుకునే ఓ మంచి కథ చెప్పాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక అలా దృష్టి పెట్టిన కథలో నుంచి వచ్చిన క్యారెక్టర్ రవితేజ గారిది. ఇక ఈ కథలో ఓ అభిమానిగా జర్నీ ని మొదలుపెట్టి డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలను ఎంతో బాలన్స్ గా డిజైన్ చేశాను. ఈ సినిమా చివరి వరకు కథే చాలా గొప్పగా కనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ మంచి ఎంటర్టైన్మెంట్ తోపాటు ఎమోషన్స్ ఉంటాయి.
ఇక వాల్తేరు వీరయ్య టైటిల్ గురించి బాబి మాట్లాడుతూ.. వెంకీ మామ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే ఒక పేరు నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీం కి నేను చెప్పాను. అలాగే చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నప్పుడు వారి తండ్రిగారి దగ్గర పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ 500 రూపాయలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల కారణంగానే మద్రాస్ వచ్చానని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. దీంతో ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ కి వీరయ్య అనే పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. ఇక ఈ పేరు చిరంజీవి గారికి కూడా చాలా బాగా నచ్చింది. దాంతో ఇదే పేరుని 'వాల్తేరు వీరయ్య' అని టైటిల్ ని ఫిక్స్ చేసాం అంటూ చెప్పుకొచ్చాడు బాబి...!!