సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం లిప్ లాక్ సీన్లు చాలా కామన్ అయిపోయాయి. అయితే ఒకప్పుడు హీరో హీరోయిన్లు ఇలా కిస్ చేసుకోవడానికి చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ చెప్పకుండానే హీరో హీరోయిన్లు లిప్ కిస్ లు చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో లిప్ కిస్ లు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోల నుండి ఇప్పుడున్న కుర్ర హీరోల వరకు అందరి సినిమాలోని ముద్దు సీన్లు ఉన్నాయి.అయితే ఇప్పుడు అలాంటి సీన్లు చేస్తేనే వాళ్ళకి బాగా క్రేజ్ కూడా పెరుగుతుంది.
అంతేకాదు అలాంటి సీన్లకు ఓకే చెప్తేనే వారికి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్లో సారా అలీ ఖాన్ జాహ్నవి కపూర్ ఇలాంటి వారు కూడా ఇప్పుడు ఆ సీన్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా ఇలాంటి సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అప్పట్లో మాత్రం అస్సలు ఇలా ఉండేది కాదు. ఒక సినిమాలో ఒక హీరోయిన్ అలాంటి సీన్లు నటించాలి అంటే చాలా భయపడేవారు. ఆ కాలంలో ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ ముద్దు ఇస్తే అది అప్పట్లో సంచలనంగా మారేది. ఇక అప్పట్లో వచ్చిన దయావన్ సినిమాలో ఒక లిప్ కిస్ సీను ఉంది.
1988లో ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో వినోద్ కన్నా మాధురి దీక్షిత్ జంటగా ఒక సినిమాలో నటించడం జరిగింది.అయితే ఈ సినిమాలో భాగంగా వీరిద్దరి మధ్య ఒక లిప్ కిస్ సీను ఉంటుంది. అప్పట్లోనే ఈ హీరోయిన్ కి మంచి క్రేజ్ ఉండడంతో ఈమె బాగా డిమాండ్ చేసింది. ఇక అలాంటి స్టార్ హీరోయిన్ కి ముద్దు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ అలాంటి సీన్లలో నటించడానికి ఇష్టపడేది కాదు.అయితే ఈ సినిమాకి గాను ఈ సీన్లో నటించేందుకు ఆమెకి ఏకంగా కోటి రూపాయలు ఇవ్వడంతో ఆమె కూడా ఈ సీన్ నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పట్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది ఒక్క అమితాబచ్చన్ మాత్రమే.అప్పటి కోటి రూపాయలు ఇప్పటి తో పోలిస్తే 25 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే అప్పట్లో ఒక్క లిప్ కోసం 25 కోట్లు తీసుకుంది ఈమె..!!