షాకింగ్: కోలీవుడ్ లో మరో స్టార్ కఫుల్ విడిపోతున్నారా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ కపుల్స్ విడాకులు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓవైపు ఇండస్ట్రీలో పెళ్లి భాజలు మోగుతుంటే మరోవైపు సెలబ్రిటీల విడాకులకు సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల కోలీవుడ్ లో తమిళ హీరో ధనుష్ అతని భార్య ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల వివాహ బంధానికి సోషల్ మీడియా వేదికగా ఈ జంట స్వస్తి పలికారు. వీరి విడాకుల వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని మరువక ముందే కోలీవుడ్లో మరో స్టార్ కపుల్ విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ కపుల్ మరెవరో కాదు మన కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ఆయన భార్య సంగీత. ఇక ఈ ఇద్దరూ తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారని..

త్వరలోనే విడాకులను సైతం అధికారికంగా ప్రకటించబోతున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ ఉన్నట్టుండి ఈ ప్రచారానికి కారణం ఏంటంటే.. తాజాగా తలపతి విజయ్ హీరోగా నటించిన వారిసు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన సతీమణి సంగీత అటెండ్ అవ్వలేదు. దాంతోపాటు మొన్నా మధ్య కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ భార్య సీమంత వేడుకకు సైతం ఆమె హాజరు కాలేదు. ఆమె లేకుండా విజయ్ ఒక్కడే ఆ వేడుకకు హాజరవడం జరిగింది. దాంతో ఈ జంట మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని.. అందుకే త్వరలో వాళ్ళు విడిపోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎటువంటి నిజాలు లేవని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం దళపతి విజయ్ భార్య సంగీత పిల్లలతో విదేశాల్లో ఉన్నారని.. త్వరలోనే విజయ్ కూడా వాళ్ల దగ్గరికి వెళ్లబోతున్నట్లు చెబుతున్నారు. ఆమె విదేశాల్లో ఉన్న కారణంగానే ఇక్కడ కనిపించడం లేదని అంతేతప్ప వాళ్ళు ఎటువంటి విడాకులు తీసుకోవట్లేదని వారి సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 1999 లో దళపతి విజయ్ సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ నటించిన వారిసు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: