ప్రభాస్ ఫేవరేట్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అండ్ స్టాపబుల్ సీజన్ 2 కి ప్రభాస్ గెస్ట్ గా  హాజరైన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ ఎపిసోడ్లో ప్రభాస్ తోపాటు ఆయన స్నేహితుడు గోపీచంద్ కూడా రావడం జరిగింది. ఇక ప్రభాస్ వచ్చిన ఈ షోని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు ఆహా టీమ్. ఇక  మొదటి భాగం నిన్న రాత్రి 9 గంటలకు ప్రసారమైనప్పటికీ.. జనవరి 6న రెండవ భాగం స్ట్రీమింగ్ కానుంది.అయితే  ఈ షోలో భాగంగానే బాలయ్య ప్రభాస్ ని చాలా ప్రశ్నలను అడగడం జరిగింది. 

చాలా సరదా సరదాగా ఈ షో చాలామందిని ఆకట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే బాలయ్య ప్రభాస్ ను.. నీ ఆల్ టైం ఫేవరెట్ దర్శకుడు ఎవరు.. అని అడగగా ప్రభాస్ నా ఫేవరెట్ డైరెక్టర్ లు ఇద్దరు ఉన్నారు అని వారు ఎవరో కాదు దిగవంత దర్శకుడు బాబు మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.అయితే  ఆ ఇద్దరు దర్శకుల సినిమాలను నేను ఎప్పటికీ మిస్ అవ్వను అని వారి సినిమాలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూస్తాను అని..అంతేకాదు  భవిష్యత్తులో అవకాశం వస్తే మణిరత్నం గారితో కచ్చితంగా సినిమా చేస్తాను అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

 దీంతోపాటు అనేక రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ దీంతో ఈ విషయం తెలిసిన కోలీవుడ్ మరియు టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇలాంటి షో కి  రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు ఈ షోలో ప్రభాస్ నార్మల్ గా ఎలా ఉంటాడో చాలామందికి తెలిసింది. బాలయ్య పై పంచులు వేస్తూ ఈ షోలో ఎంజాయ్ చేశాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: