బుచ్చిబాబుకు కొత్తపరీక్షలు పెడుతున్న చరణ్ !

Seetha Sailaja

దర్శకుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ తరువాత తాను తీసే సినిమా ఒక టాప్ యంగ్ హీరోతో మాత్రమే తీస్తాను అని పట్టిన పంతానికి రామ్ చరణ్ సహకారం లభించడంతో ఇప్పుడు ఆమూవీ పట్టాలు ఎక్కడానికి సిద్ధం అవుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న అలాంటి మూవీ కథ ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాలేదు అంటున్నారు.


ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ఒక ఆశక్తికర న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో లీక్ అయింది. ఈమూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు బుచ్చిబాబు ఈమూవీ పై 100 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ శిష్యుడుగా పేరు గాంచిన బుచ్చిబాబు సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడడు అని అంటారు.


గతంలో బుచ్చిబాబు మైత్రీ సంస్థకు ‘ఉప్పెన’ తీసే సమయంలో ఆసినిమా ప్రారంభంలో 5 కోట్లు అవుతుంది అని చెప్పి 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టించాడు అని అంటారు. అయితే ఆమూవీ ఊహించని విధంగా బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో మైత్రీ సంస్థకు కాసులు కురిసాయి. ఇప్పుడు 100 కోట్లు చరణ్ సినిమాకు బడ్జెట్ అని బుచ్చిబాబు అనడంతో ఎలర్ట్ అయిన నిర్మాతలు ఈవిషయాన్ని చరణ్ దృష్టి వరకు తీసుకువెళ్ళినట్లు సమాచారం.


చరణ్ బుచ్చిబాబును పిలిపించి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత బుచ్చిబాబుకు ఒక సలహాను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా నిర్మాణానికి సంబంధించి బుచ్చిబాబు కోరుకుంటున్న భారీ బడ్జెట్ సంబంధించిన ఊహాజనితమైన లెక్కలతో పాటు ఈమూవీకి సంబంధించిన స్టోరీ బోర్డ్ అదేవిధంగా ఆ స్టోరీ బోర్డ్ ను సపోర్ట్ చేసే విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో రేఖా మాత్రంగా తీయబోతున్న మూవీ ఇలా ఉండబోతోంది అన్న డ్రాయింగ్స్ తో ఒక పక్కా ప్రాజెక్ట్ వర్క్ ను కొన్ని లక్షల ఖర్చుతో తయారు చేస్తే అసలు ఈమూవీకి 100 కోట్ల బడ్జెట్ అవసరమా కాదా అన్నవిషయం తేలిపోతుంది అంటూ చరణ్ బుచ్చిబాబుకు ఒక మధ్యమార్గాన్ని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: