అవతార్ 2: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. కలెక్షన్స్ చూస్తే షాక్..!
జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ టు సినిమా కేవలం ఇండియాలోని 6 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత డిమాండ్ ను బట్టి 4500 స్క్రీన్ లలో విడుదల చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకు 600కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇండియా మొత్తంలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ 3డీలో విడుదలైన ఈ సినిమాకు ఇండియాలో మొదటి రోజు మార్నింగ్ షోలకు 26.98 థియేటర్ కొనసాగింది.
మధ్యాహ్నం నుంచి ఆక్యుపెన్సీ మరికొంత పెరిగింది. ఈవినింగ్ నైట్ షోలకు 3డీలో అయితే భారీగా స్పందన పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాదులోని మంచి ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. సెకండ్ షోలకు మొత్తంగా 64 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదయింది. ముఖ్యంగా సౌత్ లో చూసుకున్నట్లయితే రూ. 15 కోట్ల మేర నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా మొదటి రోజైతే ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ కేవలం రూ.38 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం గమనార్హం.