కోలీవుడ్ భామ త్రిషకు 20 యేళ్లు..!!

Divya
కోలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తెలుగు , తమిళ్ సినిమాలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఇప్పటివరకు మూడు సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. 1983 చెన్నై మహానగరంలో కృష్ణన్ ఉమా దంపతులకు జన్మించిన ఈమె అందాల పోటీలలో మిస్ చెన్నై గా ఎంపికైన తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో కూడా పాల్గొనింది. అక్కడ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. డిసెంబర్ 13 నాటికి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రియాకు ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే మరొకవైపు తనను ఇండస్ట్రీలో మళ్ళీ నిలబెట్టిన చిత్రాన్ని త్రిష గుర్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. 1999 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న త్రిష అన్ని భాషల చిత్రాలలో నటించి మెప్పించింది. ఇప్పటివరకు 70కి పైగా సినిమాలలో నటించిన ఈమె సీనియర్ హీరోయిన్గా ఇప్పటికీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చి డిసెంబర్ 13 కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈమెను పోగుడుతూ త్రిష త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు.  దక్షిణాది ఆడియన్స్ లో ఈమె పేరు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈమె  గ్లామర్ విషయంలో కూడా యువతను కట్టిపడేసింది.

వర్షం సినిమాతో తెలుగులో కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె ఎన్నో చిత్రాలలో నటించి మరింత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో త్రిషను పొన్నియన్ సెల్వన్ చిత్రమే మళ్లీ నిలబెట్టింది అంటూ పోస్ట్లు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈమెకు ఈ సినిమా మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: