ఏకంగా ఆ స్టార్ హీరో పక్కనే ఛాన్స్ కొట్టేసిన సింగర్ సునీత..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా మంచి గుర్తింపును పొందిన సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేస్తుంది ఈమె  అయితే అలాంటి ఈమెకు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది అంతేకాదు స్టార్ హీరోయిన్లకు సమానమైన క్రేజ్ ను అందుకుంది అని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు. అయితే ఈమె సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది .

సునీతకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది అయితే తాజాగా ఈమెకి సంబంధించిన ఆసక్తికరమైన వాడుతా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది .అయితే ఇప్పటివరకు తెర వెనక తన వాయిస్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత ఇప్పుడు వెండి ధర ఎంట్రీకి రెడీ అయ్యింది అనే వార్తలు వస్తున్నాయి ఇన్నాళ్లు సింగర్ స్టార్ గుర్తింపు పొందిన సునీత త్వరలోనే నటిగా కూడా పరిచయం అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఏమిటి ఓ స్టార్ హీరో సినిమాలో వెండి ఇచ్చేందుకు రెడీ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం దర్శకుడు అయిన త్రివిక్రమ్ సునీతను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక పాత్ర నచ్చడంతో సింగర్ సునీత కూడా వెంటనే ఒప్పుకున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే నిజం అయితే గనుక ఈమె అభిమానులకు పండగ అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సునీత మహేష్ బాబు కి అక్కగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: