త్వరలో బిగ్ స్క్రీన్ పై నారప్ప చిత్రమ్..!!

murali krishna
విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన 'నారప్ప' చిత్రం కరోనా లాక్ డౌన్ సమయం లో డైరెక్టుగా ఓటీటీ లో విడుదలైన సంగతి మనకీ తెలిసిందే..అప్పట్లో వెంకటేష్ ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లో విడుదల చేస్తున్నందుకు చాలా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు..కొంతమంది అభిమానులు అయితే ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చెయ్యకపోతే ఆత్మహత్య చేసుకుంటాము అంటూ సురేష్ ప్రొడక్షన్స్ కి ఉత్తరాలు కూడా రాసారు అంటా మరీ

కానీ అమెజాన్ ప్రైమ్ నుండి అద్భుతమైన ఆఫర్ రావడం తో సురేష్ బాబు అభిమానుల ఎమోషన్స్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఓటీటీ లో విడుదల చేసాడు..రెస్పాన్స్ బాగానే వచ్చింది కానీ..థియేటర్స్ లో విడుదల చేసి ఉంటె వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేదని చూసిన ప్రతి ఒక్కరికి కలిగిన ఫీలింగ్..వెంకటేష్ ని ఇంత మాస్ యాంగిల్ లో చూసి చాలా కాలం అయ్యిందని..ఇలాంటి సినిమాని థియేటర్స్ లో విడుదల చేయనందుకు ఫ్యాన్స్ ఇప్పటికి సురేష్ బాబు ని తిడుతూనే ఉంటారు అని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకునే ఫ్యాన్స్ కోసం సురేష్ బాబు ఇప్పుడు రిలీజ్ చెయ్యబోతున్నాడు అంట..డిసెంబర్ 13 వ తేదీన వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు అట..ఇన్ని రోజులు కేవలం ఓటీటీ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మాస్ ఆడియన్స్ బాగా దగ్గరకి వస్తుంది.
ఇప్పటి వరుకు థియేటర్స్ లో ఎవ్వరు చూడని సినిమా కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశం  చాలా ఎక్కువ గా ఉంది..సురేష్ బాబు ప్రొమోషన్స్ కోసం కాస్త ఖర్చు పెడితే చాలు..ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట..విక్టరీ వెంకటేష్ కి ఈమధ్య కాలం లో అన్ని మల్టీస్టార్ర్ర్ హిట్స్ మాత్రమే ఉన్నాయి కానీ..సోలో హీరో గా మాత్రం సరైన హిట్టు లేదు..మరి ఈ రీ రిలీజ్ తో ఆయనకీ హిట్ వస్తుందో లేదో మనం వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: