మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం మొదట ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో తెరకెక్కిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ చిరంజీవి మరియు రవితేజ లపై భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ ల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న మూవీ కావడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంతరాలు పెట్టుకున్నారు.