RRR పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి...!!
ఎలా ప్రమోట్ చేయాలో సినిమాను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలిసినట్లుగా మరే దర్శకుడికి తెలియదు అని . ఆ విధంగా ఆలోచించే జక్కన్న గతంలో మహాభారతం సినిమాను తెరపైకి తీసుకు వస్తాను అని చెప్పి అభిమానుల్లో భారీ ఆశలను రెపారు.
అయితే ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడానికి మాత్రం ప్రస్తుతం తన అనుభవం సరిపోదు అని ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అని చాలా సింపుల్ గా అయితే సమాధానం ఇచ్చాడు. అలాగే మరికొన్నిసార్లు తీయాలనే ఆలోచన కూడా ఉంది కానీ అది వెంటనే తీస్తాను అని నేను చెప్పలేదు అని కూడా జక్కన్న మరొక జలక్ అయితే ఇచ్చాడట.
అయితే ఇప్పుడు రాజమౌళి rrr సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై ఆశలు రేపడం హాట్ టాపిక్ గా మారిందట.. ఇటీవల అమెరికాకు వెళ్లిన రాజమౌళి అక్కడ ఒక ఈవెంట్లో rrr సీక్వెల్ కు సంబంధించిన ఆలోచన చర్చల దశలో ఉంది అని భవిష్యత్తులో అది రావొచ్చు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడని తెలుస్తుంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా చాలా అద్భుతంగా చూపించిన రాజమౌళి సెకండ్ పార్ట్ లో ఏ విధంగా చూపిస్తాడు అనేది కూడా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
అయితే ఆ ప్రాజెక్టు రావడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం రాజమౌళి పూర్తిస్థాయిలో మహేష్ బాబు సినిమా పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పను కూడా లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అలాగే రాజమౌళి ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాడని తెలుస్తుంది.. మరి rrr సినిమా సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందో మరి చూడాలి