పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తిరిగి అభిమానుల కోరిక మేరకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా వకీల్ సాబ్ మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.
ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని సార్లు వాయిదా పడుతూ రావడం తో ఇప్పటికీ కూడా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" మూవీ సెట్స్ పై ఉండగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో దర్శకత్వంలో వినోదయ సీతం అనే తమిళ్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేవలం హరిహర వీరమల్లు మూవీ ని పూర్తి చేసి , ఈ మిగతా మూవీ లను పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ దర్శకుల అందరికీ కూడా ఇతర మూవీ లు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.