ఆమె వల్లే యశోద సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?
ఇక కొద్ది రోజులుగా కొత్త సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.ఈ మధ్యకాలంలో ఆమెకు మయోసిటీస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది. సమంత నటించిన చిత్రాలలో యశోద ఒకటి. ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం. అయితే ఈ బడ్జెట్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
యశోద సినిమాను జస్ట్ రూ.3 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేయాలని డైరెక్టర్ , ప్రొడ్యూసర్ అనుకున్నారట. ఈ స్టోరీ సమంతకి నచ్చటంతో ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా చేయాలని శివలెంక కృష్ణ ప్రసాద్ అనుకున్నాడట . ఈయన దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టారట అందరికీ రీచ్ కావాలని ఉద్దేశంతో భారీ స్కేల్ రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.10 కోట్లు బ్రేక్ ఈవెంట్ సాధించడమే కష్టంగా ఉంది. అలాంటి యశోద కోసం రూ 40 కోట్లు బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందా అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక ఇటీవల యశోద ప్రమోషన్ లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మయోసిటీస్ వ్యాధి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు ఇప్పటికింకా నేను చావలేదని కానీ కొన్ని రోజులు మంచి రోజులు, కొన్ని రోజులు చెడ్డ రోజులు ఉంటాయని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక నేను ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేదేమోననిపించింది. అయినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంత దాకా వచ్చానా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సమంత.