షోయబ్. సానియా మీర్జాన్ మోసం చేశారా..!!

Divya
ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఫాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లుగా తాజాగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల బాట పట్టినట్లుగా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా తప్పని అందులో వాస్తవం ఏమాత్రం లేదని మరి కొంతమంది చెబుతూ ఉన్నారు. ఒకవేళ అదే తప్పు అయితే మరి కంటి ముందు కనిపిస్తున్న ఈ వాదనలు మాటేమిటి అంటూ ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.
గతంలో సానియా, షోయబులు విడిపోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఆ తర్వాత అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. అయితే ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు ఈ ప్రచారం ఎలా మొదలైంది అనే విషయానికి వస్తే.. సానియా మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్టోరీని అందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో" where do broken hearts go.to find allah "అయితే ఇందుకు పూర్తి అర్థం ముక్కలైన హృదయం ఎక్కడకు వెళుతుంది అల్లాను అన్వేషిస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

ఈ పోస్టును చూసిన వెంటనే ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి కూడా చాలా సరిగ్గా లేదని పోస్టులో తెలియజేసింది. షోయబ్ తో తనకు కుదరదని అందుకే విడాకులు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తాను తీసుకునే నిర్ణయాన్ని పరోక్షంగా ఇలా చెప్పినట్లుగా వ్యాఖ్యానిచ్చింది సానియా మీర్జా. అంతే కాకుండా కొడుకు పుట్టినరోజు వేడుకల్ని దుబాయిలో చాలా ఘనంగా జరుపుకుంది ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించలేదని విషయాన్ని ప్రస్తావించింది. దీంతో షోయబ్ సానియాను మోసం చేశారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: