విజయ్ దేవరకొండ భాషతో సంబంధం లేకుండా భారీ స్థాయిలో అభిమానులను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో సంచలన విజయం అండుకోగా ఆ తరువాత విడుదలైన ప్రతి భాషలోనూ దానికి భారీ స్థాయి లో పేరు వచ్చింది. ఈ నేపథ్యంలోనే భాషతో సంబంధం లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమా కి క్రేజ్ ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా తెలుగు తర్వాత ఆయనకు హిందీలో ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. దానికి తగ్గట్లుగానే అక్కడ ఆయనకు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది.
ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన కూడా ఆ సినిమాకు ఆయన చేసిన ప్రమోషన్ కార్యక్రమాల వల్ల ప్రేక్షకులలో మంచి గుర్తింపు అయితే ఏర్పడింది. అందుకే విజయ్ దేవరకొండకు మంచి మార్కెట్ అక్కడ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా ఆయనకు మంచి మార్కెట్ పెరిగే సూచనలు ఉన్నాయి.
మలయాళ తమిళ సినిమా పరిశ్రమలలో సైతం ఈ హీరోకు మరింత క్రేజీ పెరిగే అవకాశం లేకపోలేదు. మరి భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని భాషల పెంచుకులను అలరించే విధంగా సినిమాలను చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రం ద్వారా ఇలాంటి ఒక రేంజ్ ను మూటకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాను ఓకే చేసుకునే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే విధంగా ఆయన ప్లాన్స్ చేస్తూ ఉండగా ఇంకొక వైపు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఆయన చేసే విధం గా సిద్ధం చేసుకుంటున్నాడు.