వావ్: సమంత చేస్తున్న పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనా..?

Divya
ఒకపక్క సమంతకు వచ్చిన వ్యాధితో బాధపడుతూ ఉంటే మరొక పక్క యశోద సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరి హరిష్ దర్శకత్వం వహించారు. ఒకపక్క సమంత ఈ సినిమా ప్రమోషన్లకు హాజరు కాలేక అనారోగ్య సమస్యతో బెడ్ మీద ఉన్న సరే ఈ సినిమా బిజినెస్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ప్రమోషన్లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నది. అందుచేతనే సమంతతో యాంకర్ సుమ ఒక స్పెషల్ రికార్డెడ్ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకోసం సమంత ఒక గంట పాటు ట్రీట్మెంట్ ని ఆపేస్తున్నారని సమాచారం వీటితోపాటు మరికొన్ని రికార్డెడ్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయింది రిలీజ్ అయినా కాకపోయినా తనకి ఎలాంటి సంబంధం లేదని కొంతమంది హీరోయిన్స్ అలా అనుకుంటూ ఉంటారు కానీ సమంత మాత్రం అలా అనుకోవడంలేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు. సమంత మాత్రం తన హెల్త్ కండిషన్ బాగా లేకపోయినా సరే నిర్మాతల కష్టాన్ని గురించి ఆలోచించి యశోద సినిమా ప్రమోషన్స్ కి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిర్మాతలు వద్దని ఎంత చెప్పినా కూడా సమంత కచ్చితంగా సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ ఇస్తానని తెలియజేస్తుందట. ఈ విషయం విన్న అభిమానులు సినీ ప్రముఖుల సైతం సమంత డెడికేషన్ కి హ్యాండ్సప్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత సమంత చేతిలో శాకుంతల, ఖుషి సినిమాలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక ఈ రెండు సినిమాలు సమంత అనారోగ్య కారణంగా కాస్త లేటుగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి యశోద సినిమా ఈనెల 11న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: