బాంబ్ పేల్చిన వేణు స్వామి.. త్వరలో ఆ హీరో, హీరోయిన్ చనిపోతారంటూ..??

Anilkumar
ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి.. గురించి అందరికి తెలిసిందే. ఇక  సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖల జీవితాలలో ఎప్పుడు ఏం జరగబోయేది తెలుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. సమంత - నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు.ఇక  రష్మిక తో కూడా తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నేనేనని , తనతో వాళ్ళ ఇంట్లో ప్రత్యేక పూజలు కూడా చేశాను అంటూ తెలిపారు.ఇక మెగాస్టార్ కూతురుది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదే అంటూ ఆమె కూడా మూడో పెళ్లి చేసుకుంటుంది అంటూ రకరకాలుగా మాట్లాడాడు. 

 అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోతారంటూ హాట్ బాంబు పేల్చాడు.అయితే కొంతమందికి జాతకాల మీద నమ్మకం ఉండవచ్చు.. ఉండకపోవచ్చు.. అది వారి వ్యక్తిగత విషయంపై ఆధారపడి ఉంటుంది.  వేణు స్వామి మాత్రం తనను తానే మార్కెట్ చేసుకోవడానికి సెలబ్రిటీల జీవితాల్లో ఇలా అవుతాయి.. అలా అవుతాయి అంటూ మాట్లాడుతున్నారు. అయితే  ఇక  ఈ విషయంపై తాజాగా సీనియర్ జర్నలిస్టు ఇమ్మంది రామారావు మాట్లాడుతూ.. వేణు స్వామి మాటలను ఖండించారు.

కాగా  సమంత - నాగచైతన్య విడిపోతారు అని నేను చెప్పాను అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశాడు కదా.. అది వారి వ్యక్తిగత విషయం.. అందులో ఇతనేందుకు మాట్లాడడం.. డబ్బు సంపాదన కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం ఏంటి అంటూ జర్నలిస్ట్ ఫైర్ అయ్యాడు..అంతేకాదు ఇక  ఇండస్ట్రీ లో ఓ హీరో హీరోయిన్ మరణిస్తారు అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు. అతను చెప్పేవి నిజం అయ్యేది పక్కన పెడితే మార్కెట్లో తనను మార్కెట్ చేసుకోవడానికి ఇలా చెత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు..  అయితే ఈ వైఖరి తప్పు అంటూ ఇమ్మంది రామారావు అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు ఇతని మీద గౌరవం ఉండేది.. కానీ ఇలాంటి చేష్టల వల్ల అది కూడా పోయింది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఏది ఏమైనా వేణు స్వామి చేసిన అన్ని కామెంట్స్ ప్రజలకు విపరీతంగా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: