నయన్ తర్వాత అలా చేస్తున్న సమంత!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు సౌత్ సినిమా పరిశ్రమలోనే అగ్ర కథనాయకలుగా కొంతమంది ఉన్నారు. మొన్నటిదాకా నయనతార అగ్రస్థానంలో కొనసాగుతూ తన క్రేజ్ను చాటి చెప్పింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సైతం ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలోనే ఫాలోయింగ్ ఉంది అంటే ఆమె ఏ స్థాయిలో అక్కడి ప్రేక్షకులకు అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ తరువాత అంతటి స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ గా సమంత ఎంపికైందని తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి చెప్పవచ్చు.

వివాహం చేసుకున్న తర్వాత ఈమె కెరియర్ దాదాపుగా క్లోజ్ అయిపోయిందన్నట్లుగానే ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ విడాకులు తీసుకోవడం తో మళ్ళీ ఆమె సినిమాలలోకి రావాలని భావించి ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ఉంది. ఆ విధంగానే ఇప్పుడు ఆమె చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఒక స్టార్ హీరో సినిమా కూడా ఉంది. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులను ఓకే చేసిన ఈ ముద్దుగుమ్మ పెద్ద హీరోల ఆ సినిమాలలో నటించబోతుంది. అంతేకాదు ఆ మధ్య ఆమె హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపించాయి. 

ఇన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్న నేపథ్యంలో నయనతార తర్వాత అంతటి స్థాయిలో పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ గా ఈమె గుర్తింపు సంపాదించుకుందనీ చెప్పవచ్చు. ఈమె దాదాపుగా రెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం నెంబర్ వన్ హీరోయిన్ అనడానికి కారణం అవుతుంది అని చెప్పాలి. ఏదేమైనా సమంతకు ఈ స్థాయిలో క్రేజ్ రావడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. ప్రస్తుతం యశోద అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఈమె ఆ తర్వాత మరొక లేడీ ఓరియంటెడ్ సినిమా శాకుంతలం చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మార్చిలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: