జగన్, బాబు: ఎవరికీ కనిపించని వేవ్.. జుట్టుపీక్కుంటున్న బెట్టింగ్ ముఠాలు?
అయితే సంస్థాగత నిర్మాణం చూసుకున్నట్లయితే టీడీపీ ఉన్నంత బలంగా వైసీపీ లేదనే చెప్పాలి. అందుకనే వైసీపీని ఈ ఒక్కసారి దెబ్బకొడితే.. పార్టీ పేకమేడలా కూలిపోతుంది. నాయకులంతా మన వైపు వచ్చేస్తారు. తద్వారా ఏపీ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలవచ్చు అనే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇక ప్రత్యామ్నాయ శక్తిగా తాము ఎదగవచ్చని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎడాపెడా హామీలు ప్రకటిస్తూ.. ప్రచారంలో జోరును పెంచుతున్నారు.
కాకపోతే క్షేత్రస్థాయి పరిస్థితులు ఎవరికీ అర్థం కావడం లేదు. టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా.. అధికార వైసీపీని ఆదరిస్తారా అనేది అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉండగా నాయకుడిని పట్టించుకుంటారు తప్ప సంస్థాగత నిర్మాణం తదితర అంశాలను ప్రజలు పట్టించుకోరు అని జగన్ నమ్ముతున్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్నా కూడా చంద్రబాబు బయటకు రాగానే ఆ పార్టీ కుదేలైంది. నాయకుడు బలహీనంగా ఉన్నా కూడా పార్టీ ఎంత సంస్థాగతంగా బలంగా ఉన్నా కూడా గెలవదు అని జగన్ విశ్వసిస్తున్నారు.
అందుకే ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, డీబీటీ పద్దతి ద్వారా ఇంటింటికీ అందిన నగదు వంటి వాటిని పరిశీలించాలని కోరుతున్నారు. జగన్ రూ.10వేలు పంచింనా అది నేరుగా లబ్ధిదారునికి ఖాతాకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లోంది. మధ్యలో ఎలాంటి దళారులు, అధికారులను ఆశ్రయించాల్సిన పని లేదు. మరి వ్యక్తి ప్రాధాన్యమా.. పార్టీ ప్రాధాన్యమా అనేది త్వరలో తేలనుంది.