నిర్మాత ల పై షాకింగ్ కామెంట్స్ చేసిన సోనాలి బింద్రే..??

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. ఇంద్ర , మన్మథుడు సినిమాలు ఆమె కెరీర్ లో స్పెషల్ సినిమాలు అని చెప్పవచ్చు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు సోనాలి బింద్రే . ఆ తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్‌ బారిన పడడంతో మరికొంత గ్యాప్‌ వచ్చింది. క్యాన్సర్‌ నుంచి కోలుకుని తాజాగా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారామె.సోనాలిబింద్రే నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వాఖ్యలు కాస్త ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.సోనాలి బింద్రే అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా 'ది బ్రోకెన్‌ న్యూస్‌' సీజన్‌2తో ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ 90ల్లో సినిమా నిర్మాతలే హీరో-హీరోయిన్ల మధ్య రూమర్స్ క్రియేట్‌ చేసేవారు.వాళ్ల సినిమాల ప్రమోషన్స్‌ కోసమే ఇలా చేసేవారు. అది తెలిశాక నేను ఆశ్చర్యపోయాను' అని చెప్పారు. అప్పట్లో ఈ రూమర్స్ ట్రెండ్ విపరీతంగా ఉండేది. వాటిలో ఏదీ నిజం లేదు. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతానని అనుకోలేదు' అని అన్నారు.నిర్మాతలే తనని బాడీ షేమింగ్ చేసేవారని ఆమె అన్నారు.నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్‌ ఇండస్ట్రీలో నడుస్తూనే ఉంది. రూమర్స్‌ను మీడియాకి నిర్మాతలే లీక్ చేసేవాళ్లు. ఈ విషయం తెలిసి అప్పట్లో నేను షాకయ్యా అంటూ అప్పటి విషయాలను చెప్పకొచ్చారు సోనాలిబింద్రే. అంతేకాదు తనని నిర్మాతలు బాడీ షేమింగ్ కూడా చేసేవారని తెలిపింది.
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పడు చాలా సన్నగా ఉండేదాన్ని. దీంతో నిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేసేవాళ్లు. నాపై జోకులు కూడా వేసుకునేవారు. అప్పట్లో హీరోయిన్లంతా కాస్త లావుగా ఉండేవారు. నన్ను కూడా అలా తయారవ్వమని చెప్పేవారు. కానీ, నేనేప్పడూ వారి మాటలను పట్టించుకోలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను అభిమానులు అదరించారు. స్టార్ హీరోయిన్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు.ఒకానొక సమయంలో అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేసి స్టార్‌గా హీరోయిన్ అయిపోయారు సోనాలిబింద్రే. ఆమె టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలందరితో నటించారు.
ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. బాలీవుడ్‌లో కూడా ఈమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కానీ, ఆ తర్వాత సోనాలి సినిమాలకు దూరమయ్యారు. సుమారు పదేళ్లతర్వాత ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా ఓ వెబ్‌సిరీస్‌తో.స్టార్‌గా హీరోయిన్‌గా కొనసాగుతానని కూడా అనుకోలేదు. నాకు వచ్చిన అవకాశాలు, ఆదరించిన ప్రేక్షకుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా'' అని సోనాలి బింద్రే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: