టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు పవన్.అంతేకాదు ఒక వైపు సినిమాలు....మరో వైపు రాజకీయాల్లో బిజీగా వున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ గా ఉన్నారు.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఫాస్ట్ గా చేస్తాడు అని భావించిన వారికీ నిరాశ తప్పడం లేదు.. ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న కూడా ఈయన సెట్ లోకి అడుగు పెట్టక చాలా రోజులే అవుతుంది.
అయితే దీంతో ఈయన కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు దర్శక నిర్మాతలు సైతం ఎదురు చూస్తున్నారు.ఇకపోతే మరి పవన్ చేస్తున్న సినిమాల్లో ''హరిహర వీరమల్లు'' ఒకటి.. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటుంది.. కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది..అయితే దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.ఇక ఇది ఇలా ఉండగా ఎన్నో రోజుల తర్వాత
ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టాడని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రోజు నుండి మరొక రెండు వారాల పాటు ఆగకుండా షూట్ జరగ బోతుంది అని టాక్.. ఈ రోజు నుండి పవన్ కూడా సెట్స్ లోకి పాల్గొన బోతున్నట్టు తెలుస్తుంది. ఇక పోతే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు..కాగా మెగా సూర్య ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు..!!