నాని సినిమా కోసం మోహన్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
తాజాగా ప్యారడైజ్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే మోహన్ బాబు ఈ సినిమా కోసం అక్షరాల రూ .5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మోహన్ బాబు హీరోగా చేసిన కూడా ఇంత మొత్తంలో వస్తుందో లేదో తెలియదు. కానీ ఈ ప్రాజెక్టు కోసమైతే భారీగానే తీసుకున్నారనే విధంగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికి మోహన్ బాబు క్రేజ్ తగ్గలేదని ఆయన డైలాగ్ డెలివరీ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు.
అందుకే నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని వినిపిస్తోంది. మరి మోహన్ బాబు పాత్ర ఈ చిత్రంలో ఎలా ఉంటుంది? ప్యారడైజ్ సినిమా ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి . ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండగా, పాన్ ఇండియా లెవెల్లో 2026 మార్చి 26న విడుదల చేయబోతున్నారు. నాని కెరియర్ లోని ఇదొక డిఫరెంట్ యాక్షన్ రోల్ చిత్రం అన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నాని రెండు పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. గతంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.