ఓటీటీలోకి అడవి శేష్ డేకాయిట్.. ఎప్పుడంటే..?
ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న ప్రకారం మే 8వ తేదీన అన్ని భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లో మిస్సయిన వారు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. మరి ఈ సినిమా ఓటీటిలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, సునీల్, కామాక్షి భాస్కర్ల, ప్రకాష్ రాజ్, జాన్ మేరియా ఖాన్ వంటి నటీనటులు నటించారు.
స్టోరీ విషయానికి వస్తే.. తక్కువ కులానికి చెందిన హరి (అడవి శేష్) అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమించుకుంటారు. అయితే కులం కారణంగా ఇద్దరు విడిపోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని అపద్ధపు సాక్ష్యం చెప్పి సరస్వతి జైలుకు పంపిస్తుంది. అలా 13 ఏళ్లు జైల్లో ఉన్న హరి అక్కడి నుంచి పారిపోయి బయటికి వస్తారు. తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని బయటికి వచ్చిన హరి సరస్వతి కుటుంబ కష్టాలను చూసి చలించిపోయి సరస్వతితో కలసి డబ్బు కోసం ఏం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకు ఎందుకు పంపించింది ? సరస్వతి కోసం హరి ఏం చేస్తారు అనేదే సినిమా కథ.