పాముతో నటిస్తుంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ స్టార్ హీరో.....!!

murali krishna
ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో చేశారు? మీ హైట్‌ వల్ల ఏ హీరో అయినా ఇబ్బంది పడ్డారా?
ప్రేమ: 100కు పైగా చిత్రాల్లో చేశాను. నా హైట్‌ వల్ల కొంతమంది హీరోలు ఇబ్బంది పడ్డారు. కానీ కెమెరా ట్రిక్స్‌ ఉపయోగించి షూటింగ్‌ చేసేవారు. నేను నటించిన అన్ని సినిమాల్లో నాకు నచ్చిన పాట.. చిరునవ్వుతో సినిమాలో 'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా..' పాట చాలా ఇష్టం. చాలా అర్థం ఉంటుంది ఆ పాటలో. కోడి రామకృష్ణగారి వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఆయన సినిమాల్లో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉండేవి. వాటి కోసం నేర్చుకున్నా.
మోహన్‌బాబుతో చేయడం ఎలా అనిపించింది. వెంకటేష్‌ పక్కన అవకాశం ఎలా వచ్చింది?
ప్రేమ: 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలో మోహన్‌బాబుతో కలిసి నటించాను. చాలా భయం వేసింది. ఆ సినిమాలో కొన్ని సీన్స్‌ చూస్తే నా భయం నా ముఖంలో కనిపిస్తుంటుంది. వెంకటేష్ గారితో ధర్మచక్రం చేశాను. రామానాయుడు గారు నేను నటించిన ఓం సినిమా చూసి నాకు ధర్మచక్రంలో అవకాశం ఇచ్చారు.
జగన్మోహిని సినిమా తీసేటప్పుడు అంత పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నారా?
నరసింహ రాజు: కచ్చితంగా ఆ సినిమా హిట్‌ అవుతుందని అనుకున్నాం. ఆ సినిమా కథ చాలా బాగుంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. అన్నిట్లో బాగా ఆడింది. తమిళంలో 100 రోజులకు పైగానే ఆడింది. ఇటీవల తీసిన 'అనుకోని ప్రయాణం' సినిమా కథ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లందరూ యంగ్‌స్టర్స్ చాలా కష్టపడి పనిచేశారు. కొత్త కాన్సెప్ట్‌. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా.
మీరు సినిమాల్లోకి రాకముందు నుంచే బాగా రిచ్‌ అని విన్నాం.. నిజమేనా?
నరసింహ రాజు: బాగా కాదు కానీ పర్వాలేదు. మా నాన్న గారు కాస్త తగ్గించేశారు. నేను కూడా బాగా పోగొట్టాను. ఎవరైన వచ్చి డబ్బు కావాలని అడిగితే ఇచ్చేస్తా. రేపు వస్తుందిలే అనే ధైర్యంతో ఉన్నది ఖర్చుపెడతా. అది రాదు (నవ్వుతూ).

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: