కాజల్, అల్లు అర్జున్ అఫైర్ అప్పట్లో సంచలనం లేపిందిగా...!!

murali krishna
దాదాపు 15 సంవత్సరాల పాటు సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది కాజల్ అగర్వాల్. ఈమె లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిందట.
ఆ తర్వాత దాదాపు తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. మగధీర సినిమాతో ఒక్కసారిగా ఈమె రేంజ్ మారిపోయింది.ఇక కొన్ని సంవత్సరాల క్రితం తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బాబు కు కూడా జన్మించింది. ఇక ఈ విషయం పక్కన పెడితే కాజల్ సినీ కెరీర్ లో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అంతే కాదు చాలా మంది హీరోలతో కాజల్ కి లింక్స్ ఉన్నాయంటూ పుకార్లు చాలానే వచ్చాయట..
కానీ ఈ పుకార్లపై కాజల్ స్పందిస్తూ నేను ఎలాంటి ఎఫైర్స్ పెట్టుకోలేదనే సంచలన ప్రకటన చేసినా కూడా ఆమెపై ఆ పుకార్లు మాత్రం ఆగలేదు. ఈమె కెరీర్ లో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నప్పటికీ అన్నింటికన్నా ముఖ్యమైన కాంట్రవర్సీ కాజల్ అల్లు అర్జున్ ప్రేమలో పడి,సహజీవనం కూడా చేసింది అనే రూమర్ అప్పట్లో ఆమె కెరీర్లోనే హాట్ టాపిక్ గా నిలిచిందట.. కాజల్ అల్లు అర్జున్ తో చాలా రోజులు ప్రేమాయణం నడిపిందని, అంతేకాదు వారిద్దరూ కలిసి హైదరాబాద్ లోనే సహజీవనం చేస్తున్నారని వార్తలు చాలా వచ్చాయట.. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లికి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లికి బ్రేక్ పడింది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కాజల్ అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలని చాలా రోజులు ఎదురు చూసిందట.కానీ కుదరకపోవడంతో చాలా బాధపడింది అంటూ కూడా వార్తలు వచ్చాయట..
అల్లు అరవింద్ సినిమాలో నటించే హీరోయిన్ తన ఇంటి కోడలిగా వద్దు అని కండిషన్ పెట్టడంతో అల్లు అర్జున్ తన స్నేహితురాలైన స్నేహారెడ్డితో కొన్ని రోజులు ప్రేమ లో ఉండి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు కాజల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా,వారిని పెళ్లి చేసుకుంటారా అని ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తే దానికి షాకింగ్ ఆన్సర్ చెప్పింది కాజల్.. కాజల్ మాట్లాడుతూ నేను మూవీకి సంబంధించినంతవరకు ఎంతో ఎథికల్ గా ఉన్నాను.. సినిమా ఇండస్ట్రీలో నేను ఎవరితో దగ్గరగా కానీ, క్లోజ్ గా కానీ ఉండలేదు.నేను చాలా నిజాయితీగా ఉండి సినిమాల్లో నటించాను.అంతే కాదు నా సినీ లైఫ్ మొత్తం నా కష్టార్జితం అంటూ కాజల్ అప్పట్లో చెప్పిందట.ఇక కాజల్ మాటలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయట. ఇక కాజల్ చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: