పవిత్ర లోకేష్ కి గుడ్ బై. జీవితంలోకి మరో నటిని ఆహ్వానించిన నరేష్....?

murali krishna
దాదాపు నెల రోజులు నరేష్-పవిత్ర లోకేష్ ఎపిసోడ్ మీడియాలో ఉత్కంఠ రేపింది. పవిత్ర లోకేష్ ని నరేష్ నాలుగో వివాహం చేసుకున్నారన్న వార్త గుప్పుమంది.వీరిద్దరూ జంటగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపించారు. దీంతో నరేష్-పవిత్ర పెళ్లి బంధంతో ఒక్కటయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఎపిసోడ్లోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చారు. పవిత్ర లోకేష్ తో నరేష్ వివాహం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు విడాకులు ఇవ్వకుండా ఆయన మరో మహిళను ఎలా వివాహం చేసుకుంటాడని రమ్య రఘుపతి ఆరోపణలు చేశారు.
మైసూర్ లో ఒక హోటల్ గదిలో పవిత్ర-నరేష్ ఉన్నారన్న విషయం తెలుసుకొని రమ్య అక్కడకెళ్లారు. గది బయట బైఠాయించిన రమ్య ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుండి నరేష్-పవిత్రలను బయటకు పంపించారు. రమ్య ఇద్దరిపై చెప్పుతో దాడి చేయబోయింది. దీంతో కొంత హైడ్రామా నెలకొంది. పవిత్రతో తనకున్న బంధం ఏమిటో నరేష్ ఓపెన్ గా వెల్లడించారు.
పవిత్ర లోకేష్ ని నేను పెళ్లి చేసుకోలేదు. మా మధ్య పరస్పర ఆవాహన కుదిరింది. ఇద్దరం కలిసి ఉంటున్నాము. పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. ఇద్దరు కలిసి ఉండటానికి పెళ్లి కేవలం లైసెన్స్ మాత్రమే. పెళ్లి చేసుకున్న ప్రతి పది జంటల్లో ఎనిమిదిమంది విడిపోతున్నారంటూ నరేష్ లెక్కలు చెప్పాడు. కలిసి జీవించడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. పవిత్ర లోకేష్ తో నాకు అది కుదిరిందని ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు.
ఏడాదికి పైగా నరేష్-పవిత్ర కలిసి ఉంటున్నారని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య అవగాహన లోపించిందనేది తాజా సమాచారం. కొద్దిరోజులుగా విడివిడిగా ఉంటున్నారట. పవిత్రతో నరేష్ బంధం ముగిసినట్లే అని తెలుస్తుంది. విడిపోవడానికి ప్రధాన కారణం ఆయన మరో నటికి దగ్గరయ్యారట. నాలుగో బంధానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టిన నరేష్ కొత్తగా ఐదో మహిళతో రిలేషన్ కి శ్రీకారం చుట్టారట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.కాగా నరేష్ అధికారికంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: