వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి మహారాజ ట్రైలర్?

Purushottham Vinay
విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ విలువైన నటుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా ఎలాంటిదైన తన నటనతో అదరగోడతాడు. రీసెంట్ గా హ్యాపీ క్రిస్మస్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్నాడు. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ఈ కోలీవుడ్  స్టార్ హీరో విజయసేతుపతి  50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’.ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం ఇంకా జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో మమతా మోహన్ దాస్  హీరోయిన్ గా నటించగా.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి ఇంకా అలాగే భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ‘లక్ష్మీ’ ఎవరంటూ సస్పెన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


ఇక ఈ ట్రైలర్ లో విజయ్ సేతుపతిని ఓ సెలూన్ షాప్ నడిపే మహారాజా అనే వ్యక్తిగా పరిచయం చేశారు. ఆ తర్వాత హీరో తన ఇంట్లో లక్ష్మీ కనిపించడం లేదని.. కేసు ఫైల్ చేయాలనీ పోలీసులను కోరుతాడు. ఇక లక్ష్మీ అంటే.. నగలు, పెట్టెలు, డ్యాకుమెంట్లు, భార్య , సోదరి ఇవేవి కాదని చెబుతాడు హీరో. దీంతో ఈ లక్ష్మీ ఎవరనే తెలుసుకునే ప్రయత్నంలో పిచ్చెక్కిపోతూ ఉంటారు పోలీసులు. మరో వైపు ఒక ఇంట్లో ఏదో ఒక మిస్టరీ ఉన్నట్లుగా చూపించారు. అసలు ఈ లక్షీ ఎవరు..? దాని కోసం విజయ్ సేతుపతి ఎందుకు అలా అయ్యాడు అనేది ట్రైలర్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. ట్రైలర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో విజయ్ సేతుపతి హిట్టు కొట్టేలా ఉన్నాడు. చూడాలి ఈసారి విజయ్ ఈ సినిమాతో తన రేంజ్ కి తగ్గట్టు హిట్టు కొడతాడో లేడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: