రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించారు. అలియా భట్ సీత పాత్రను పోషించగా.. అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఆర్.ఆర్.ఆర్ సినిమా జపనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం తారక్ .. చరణ్ ఇద్దరూ తమ కుటుంబాలతో జపాన్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇటీవల విమానాశ్రయంలో జపాన్ కు బయలుదేరాడు. అక్టోబర్ 21న జపాన్ లో విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కోసం రాజమౌళి సహా రామ్ చరణ్ జూ.ఎన్ టిఆర్ కూడా జపాన్ పయనమయ్యారు. జపాన్ లో మగధీర,బాహుబలి -1.. బాహుబలి 2 సంచలన విజయాలు సాధించాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగా ఆడతాయి. ఎన్టీఆర్ డాన్స్ అంటే జపాన్ వాళ్లకి తెగ ఇష్టం. అందుకే ఆయన స్టెప్పులు వేస్తూ సందడి కూడా చేస్తుంటారు.
ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ పైనా భారీ అంచనాలున్నాయి. దీంతో మేకర్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ప్రచార ప్రణాళికకు ప్లాన్ సిద్ధం చేసారు. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ మానియా ఒక రేంజులో ఉందని ఇప్పటికే టాక్ ఉంది.జపాన్ లో పాపులర్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారని తెలిసింది. దానితో పాటు ఇతర స్థానిక పత్రికలతో పరస్పర ఇంటరాక్షన్ కి ప్లాన్ చేసారు. మరోవైపు rrr టిక్కెట్లు ప్రీబుకింగ్ కి మంచి డిమాండ్ ఉందని తెలిసింది.ప్రస్తుతం తారక్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 కోసం పని చేయాల్సి ఉంది. అలాగే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 ని పూర్తి చేసేందుకు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే డైరెక్టర్ రాజమౌళి ఫస్ట్ టైం బిగ్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమాలు వారికి ఆర్.ఆర్.ఆర్ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అవుతాయో లేదో చూడాలి.