దేవి మళ్ళీ అదరగోడతాడా?

Purushottham Vinay
తన ఫ్రెండ్ అల్లు అర్జున్ 'పుష్ప ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యువ సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్. ఆ తరువాత ఖిలాడీ, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆడియోస్ ని అందించి చాలా కాలం పాటు యూట్యూబ్ ట్రెండింగ్ లో వున్నాడు.'పుష్ప' సినిమా తరువాత దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.గతంలో చిరుతో కలిసి దేవి పని చేసిన ప్రతీ మూవీ చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. శంకర్ దాదా ఎంబీ బిఎస్,అందరి వాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 వంటి  హిట్ సినిమాలొచ్చాయి. ఈ మూడు కూడా సూపర్ హిట్స్ అనిపించుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత మెగాస్టార్ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు.


ఈ ఇద్దరిది సక్సెస్ రికార్డ్. అంతే కాకుండా మైత్రీ బ్యానర్ లో ఇప్పటికే దేవి డబుల్ హ్యాట్రిక్ హిట్ లని అందించాడు.శ్రీమంతుడు నుంచి పుష్ప వరకు మైత్రీలో డబుల్ హ్యాట్రిక్ ని సాధించిన డీఎస్పీ ఇప్పడు మెగాస్టార్ మూవీలో మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతున్నాడు. చిరు నుంచి ఆయన మార్కు మ్యూజికల్ హిట్ మూవీ వచ్చి చాలా రోజులవుతోంది. చిరుతో దేవి చేసిన శంకర్ దాదా ఎంబీ బిఎస్, అందరి వాడు శంకర్ దాదా జిందాబాద్ ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలు ఆడియోతో ముందు భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అదే స్థాయిలో చిరంజీవి నటిస్తున్న 154వ ప్రాజెక్ట్ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా క్రేజ్ ని దక్కించుకోవాలంటే ఆ బధ్యతని తన వేసుకున్న దేవి మరో సారి తనదైన స్టైల్లో మ్యాజిక్ చేయాల్సిందే. మెగాస్టార్ కూడా దేవి శ్రీప్రసాద్ నుంచి ఇదే కోరుకుంటున్నాడట.చూడాలి దేవి ఈసారి అధరగొట్టేస్తాడో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: