గాడ్ ఫాదర్: భారీ నష్టాలు.. బ్రేక్ ఈవెన్ కష్టమే?
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు సినిమాలు కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం కామన్ విషయం గా మారింది. యూఎస్ లో మెగా అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. చిరంజీవి సినిమా వస్తుంది అంటూ అక్కడ జోరు.. జోష్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈజీగా సినిమా మిలియన్ మార్క్ ను క్రాస్ చేస్తోంది.మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెల్సిందే.ఇక నయనతార ఇంకా సత్యదేవ్ లు కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన గాడ్ ఫాదర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఐతే జనాల సంఖ్య బాగా తగ్గిపోతుంది.చాలా ఏరియాల్లో సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని చోట్ల చాలా నష్టాలు వచ్చాయి.