అఖండలో లేనిది పుష్ప లో ఉన్నది ఏంటి..?

Divya
ప్రతి సంవత్సరం జరిగే ఫిలింఫేర్ అవార్డుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం అన్ని భాషల నటీనటులు సైతం అక్కడ అవార్డులను అందిచ్చి సత్కరిస్తూ ఉంటారు. వివిధ కేటగిరీలో అవార్డులను కూడా అందజేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది అఖండ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు వస్తుందని అందరూ భావించారు. ఈ సినిమా కంటెంట్ పరంగా మ్యూజిక్ పరంగా అన్ని విభాగాలలో మంచిగానే సక్సెస్ అయినప్పటికీ. అవార్డు దక్కకపోవడం పెద్ద ఎత్తున పెను దుమారానికి దారితీస్తోంది. అంతేకాకుండా ఏ ఒక్క భాగానికి కూడా ఈ అవార్డు ఎంపిక చేయకపోవడం పై అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఇదే వేదికపై పాన్ ఇండియా చిత్రంగా విడుదలై మంచి సక్సెస్ అయిన పుష్ప సినిమాకి అన్ని భాగాలలో అవార్డు రావడంతో ఇప్పుడు బాలయ్య అభిమానులు కాస్త కోపంతో చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ముడిపెట్టి చూస్తే పుష్ప చిత్రం అఖండ కన్నా గొప్ప చిత్రమా ..బాలయ్య, బన్నీ పోటీకి దిగితే బాలయ్యదే అప్పర్ హ్యాండ్ అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కంటెంట్ పరంగా చూస్తే ఈ రెండు సినిమాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది అఖండలో బాలకృష్ణ అఘోర పాత్ర హిందూ మతతో గొప్పతనాన్ని తెలియజేస్తుందని. అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ అడవి సంపాదన ఎలా దోపిడీ గురించి చేయాలో చూపించారని చెప్పవచ్చు.



దీన్ని బట్టి చూస్తే ఎవరికి అవార్డు ఇవ్వాలి మంచి చేసే వాళ్లకా.. చెడు చెప్పే వాళ్లకు అన్నట్లుగా బాలయ్య అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ఏ విధంగా టార్గెట్ చేయలేదని ఫిలింఫేర్ అవార్డు నిర్వహించేది *లీవుడ్ సంస్థలు కాబట్టి పుష్ప సినిమా పాన్ ఇండియాలో సక్సెస్ అయినందువల్ల అవార్డులో వచ్చి ఉండొచ్చని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. బాలయ్య సినిమా కూడా ఇతర భాషలలో విడుదల చేసి ఉంటే మరింత పాపులారిటీ వచ్చేదేమో అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: